తెలుగు పత్రిక రంగంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక దినపత్రిక విశాలాంధ్ర దినపత్రిక అని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి అన్నారు. విశాలాంధ్ర 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆమె ఆదివారం స్థానిక మండల పరిషత్ సమావేశపు హాలులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాలాంధ్ర తెలుగు దినపత్రిక బడుగు బలహీన కర్షక ఉద్యోగుల ఆశాజ్యోతి విశాలాంధ్ర అని అన్నారు. నేటికీ పత్రికా విలువలను కాపాడుతూ ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలను వెలికి తీస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ 73సంవత్సరాల నుండి ముందుకు సాగుతున్న ఏకైక పత్రిక విశాలాంధ్ర అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు. ఉల్లగలు సర్పంచి జనమాల నాగేంద్రం పిచ్చయ్య. అన్నపురెడ్డి బిక్షాలు రెడ్డి. నాగార్జున రెడ్డి . తదితరులు పాల్గొన్నారు.
పత్రికా రంగంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన దినపత్రిక విశాలాంధ్ర – ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి
01
Jan