నూతన సంవత్సర వేడుకలను ఆదివారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. అర్థరాత్రి నూతన సంవత్సర వేడుకలతో యువకులు కేరింతలు కొడుతూ సందడి చేసారు. మహిళలు, ప్రజలు ఎక్కువగా దైవ సన్నిధిలో గడపటానికి ఇష్టపడ్డారు. రాజకీయ నాయకులు పలు పార్టీల నేతలను కలుసుకొని శుభాకాంక్షలను తెలిపారు. దర్శిలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో అధిక సంఖ్యలో ప్రజా ప్రతినిథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొని వైసీపీ దర్శి, తాళ్లూరు ఇన్చార్జిలు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, మద్దిశెట్టి రవీంద్రలకు శుభాకాంక్షలు తెలిపారు. గజ మాలలతో సన్మానించారు. కేక్లు కట్ చేసి పంచి పెట్టారు. నూతన సంవత్సర వేడుకలలో బాగంగా ఏర్పాటు చేసిన పాట కచేరిలో డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ యువకులతో కలసి డ్యాన్స్ చేస్తూ అభివాదం చేసి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.










