తాళ్లూరు మండలంలో నూతన సంవత్సర వేడుకలను ఆదివారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. తాళ్లూరు, తూర్పు గంగవరంలలో అర్థరాత్రి నూతన సంవత్సర వేడుకలతో యువకులు కేరింతలు కొడుతూ సందడి చేసారు. మహిళలు, ప్రజలు ఎక్కువగా దైవ సన్నిధిలో గడపటానికి ఇష్టపడ్డారు. రాజకీయ నాయకులు పలు పార్టీల నేతలను కలుసుకొని శుభాకాంక్షలను తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర కార్యాలయం వద్ద తాళ్లూరు మండల నాయకులు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వరరెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డి కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, మందా శ్యామ్సన్, సుబ్బారావు ఎంపీటీసీలు బాల కోటయ్య, జీఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచి క్రిష్ణా రెడ్డి, బ్రహ్మారెడ్డి, ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర భారీ కేక్ కట్చేసి పంచి పెట్టారు. సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, యాడిక శ్రీనివాసరెడ్డి, కుమ్మిత జయరామిరెడ్డి, విష్ణు, యలమందారెడ్డి, విష్ణు, జీఎస్ ప్రభాకర్రెడ్డి, పలు ‘గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
ఎంపీపీ కార్యాలయంలో … కార్యాలయం ఆవరణలో ఆదివారం ఎంపీపీ, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైఎస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్ ఐ. వేణుగోపాల్ రెడ్డిలకు ఎంపీడీఓ కైవై కీర్తి, ఎంఈఓ జి. సుబ్బయ్య, వైద్యాధికారి ఖాదర్మస్తాన్బి, ఈఓఆర్డీ ప్రసన్నకుమార్, సీఓ మురళి, కార్యాలయ సిబ్బంది, యూటీఎఫ్ నాయకులు పుష్పగుజ్జం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇతర మండల ప్రజా ప్రతినిథులు నాయకులు రీజనల్ కోర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్సార్సీపీ నాయకులు మద్దిశెట్టి రవీంద్ర, మద్దిశెట్టి శ్రీధర్ లను అధికారులను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు.












