తాళ్లూరు మండలంలోని పలు పాఠశాలల్లో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. తాళ్లూరు ఎబీసీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తరగతుల వారిగా కేక్లు కట్చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు డ్యాన్స్లు వేసి ఆనందంతో గడిపారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సభను నిర్వహించారు. కరస్పాండెంట్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఎబీసీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పురోగతికి ప్రత్యేక ప్రణాళిక పనిచేస్తున్నారని. విద్యార్థులు ఉపాధ్యాయులను సక్రమంగా ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో గొప్ప లక్ష్యాలను ఏర్పాటు చేసి సాధించే దిశగా కృషి చెయ్యాలని సందేశం ఇచ్చారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు. అనంతరం నూతన వేడుకలను భారీ కేక్ కట్ చేసి ప్రారంభించారు. చిన్నారులు నృత్యాలు చేసి సంతోషంగా గడిపారు. ఎంఈఓ జి. సుబ్బయ్యను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


