ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ఫ్యామిలీ డాక్టర్ సేవలు ప్రతి ఒక్కరికి అందేలా తగిన సూచనలు చెయ్యాలని వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి అన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఆశ, ఆరోగ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో క్రమం తప్పకుండా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉన్న సీనియర్ సిటిజన్ కంచెర్ల పిచ్చమ్మను వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి ఘనంగా సన్మానించారు. తమకు సక్రమంగా సేవలు అందిస్తూ సకాలంలో మందులు అందిస్తున్న ప్రాధమిక ఆరోగ్య సిబ్బంది, 104 సిబ్బందికి 60 మందికి స్వీట్ బాక్స్ లను కంచెర్ల పిచ్చమ్మ అందించారు. ఉత్తమ సేవలు అందిస్తే గుర్తింపు సక్రంగా వస్తుందని అందరూ ఆయా గ్రామాలలో ఉత్తమ సేవలు అందించి సీనియర్ సిటిజన్స్ దీవేలను పొందాలని, అందుకు కంచెర్ల పిచ్చమ్మకు అందిస్తున్న సేవలు ఆదర్శంగా తీసుకోవాలని వైద్యాధికారి సూచించారు. గత మూడేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి నూతన సంవత్సరం సందర్భంగా స్వీట్స్ అందిస్తున్నట్లు కంచెర్ల పిచ్చమ్మ కుమారుడు కాలేషాబాబు తెలిపారు.
