జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి తాళ్లూరు మాజీ ఎంపీపీలు కోట రామిరెడ్డి, పోశం మధుసూధన రెడ్డి, గోళ్లపాటి మోషే, జిల్లా కోఆప్షన్ మెంబర్ షేక్ ఆదాం షరీఫ్ (బుజ్జి)లు, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. వారిని గజ మాలతో సత్కరించారు. అనంతరం రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డిని, కలసి శుభాకాంక్షలు తెలిపారు.

