దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ను తిరుపతిలో ఆదివారం ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు జడ్పిటిసి మారం వెంకటరెడ్డి, కౌన్సిలర్ విసిరెడ్డి గంగిరెడ్డిపాలెం యలమందారెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచ్ పిఎస్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ముందుగా టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను ఘనంగా సన్మానించారు.
