వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకొని మండలంలోని పలు దేవాలయాలలో భక్తులు సోమవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారమున గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేస్తే మంచి జరుగుతుందని నానుడి. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు పూజ లు నిర్వహించారు. ఉల్లగలులో ని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ పూజారి పరాశర నరసింహమూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించుకొని తీర్థప్రసాదాలు అందుకున్నారు.


