దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలు దర్శిలో సోమవారం దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, దర్శి సీఐ రామకోటయ్య, ఎస్సైలు రామక్రిష్ణ, నరసింహారావు, మల్లిఖార్జున రావు తదితరులు పుష్పగుజ్జాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, జిల్లా ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వి. చెన్నారెడ్డిలు కలసి కేక్ కట్చేయించి ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.





