ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు కొత్తపాలెం గ్రామానికి చెందిన రాష్ట్ర వ్యవసాయశాఖ, గన్నవరంలో పనిచేస్తున్న వ్యవసాయశాఖ ఉద్యోగి కోట రామిరెడ్డి గన్నవరంలో’ కేక్లను పంపిణీ చేసారు. నూతన సంవత్సర సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వసతి గృహాలలో ఉన్న విద్యార్థులకు 30 కేక్ లు పంపిణీ చేసి వారి మధ్య కుటుంబసభ్యులతో కలసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. మంచి సంకల్పంతో విద్యార్థుల మధ్య వేడుకలు నిర్వహించుకోవటంపై కోట రామిరెడ్డిని బంధు మిత్రులు అభినందించారు.



