తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెంలో ఇరువురు సమీప బంధువులు పాత కేసు రాజీ విషయమై ఘర్షణ దిగటంతో అందులో ఒకరికి గాయాలు కావటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. నాగంబొట్లపాలెంకు చెందిన కోట బుజ్జి, రావినూతల కళ్యాణ్ లు బంధువులు. గతంలో రావినూతల కళ్యాణ్కు కోట బుజ్జి మధ్య ఒక వివాదం కేసు నమోదు అయినది. దీనిపై రాజీ పడాలని కోట బుజ్జిని కోరాడు. ఆయన నిరాకరించటంతో బ్యాట్తో దాడి చేయగా తలపై చేతిపై పలు గాయాలు కావటంతో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. బాధితుడు బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
పాత కేసు రాజీ విషయమై ఘర్షణ – కేసు నమోదు
03
Jan