భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయుని సంఘ సేవకురాలు అయిన సావిత్రిబాయి పూలే192 వా జయంతి కార్యక్రమాన్ని స్థానిక ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ కే పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటిగా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి ఆ రోజు సావిత్రిబాయి చేసిన కృషే కారణమన్నారు. మహిళలు చదువు కున్నపుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అసమానతలు తొలగిపోతాయని భావించి వారికి విద్యను అందించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే అని అన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీవిద్య. వై వి సుబ్బారావు. ఎస్ వెంకటేశ్వర్ రెడ్డి. టి జానకి రామయ్య. ఎం తులసి. బి వేణుగోపాల్. టీ అశ్విని. ఎం హరిబాబు. ఎం శివ నాగేశ్వరి. జి గ్రేస్ ఇవాంజిలిన్. సిహెచ్ అనురాధ. ఆర్ రాఘవరావు. టి వెంకటేశ్వర్లు. వై చాంద్ భాషా . కె రామారావు. బి లక్ష్మీనారాయణ. ఎన్ సుజాత. జి రమ్యశ్రీ. ఎం నరసింహారావు. సిహెచ్ యమలేశ్వరా చారి. సిహెచ్ ఎలీషా వి శ్రీనివాసులు. తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
03
Jan