అర్హలైన ప్రతి ఒకకరికి సంక్షేమ పథకాలు అందించటమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ముండ్లమూరు మండల పరిషత్ సమావేశపు హాలులో బుధవారం నూతన పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పింఛన్ చేస్తానని మాట ఇచ్చి నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు . కుల మత రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే మనమందరం రుణపడి ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో 32 లక్షల మందికి పింఛన్లు ఇస్తే వైకాపా ప్రభుత్వం 62 లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పేద ప్రజల పక్షపాతి మనకు ముఖ్యమంత్రిగా రావడం అదృష్టమన్నారు. అలాంటి ముఖ్యమంత్రి కి మనం అండగా నిలిచి రానున్న ఎన్నికలలో వైఎస్ ఆర్ సి పి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కలిసి పని చేద్దాం అన్నారు. ఎంతమంది అర్హులు ఉన్నా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వారికి పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామాల వారీగా వైఎస్ ఆర్ సిపి నాయకులు ప్రజాప్రతినిధులతో సమస్యలపై సమీక్ష నిర్వహించారు. మండలంలో నూతనంగా238 పెన్షన్లు మంజూరు అయ్యాయి. అందులో వికలాంగులు 25 వితంతువులు 69 డప్పు కళాకారులు 32 వృద్ధులు 102 చర్మకారులు 10 మందికి పింఛన్లు మంజూరు చేశారు. ప్రధాన సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ముందుగా ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి జడ్పిటిసి తాతపూడి మోజస్ రత్నం రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కే కుసుమకుమారి వైస్ ఎంపీపీ వేముల పద్మ జానకి రామయ్య. వైసీపీ సీనియర్ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి. ముండ్లమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి. దర్శి ఏఎంసీ డైరెక్టర్ జిల్లెలమూడీ శివయ్య. సర్పంచులు చొప్పరపు వెంకటేశ్వర్లు. జనమాల నాగేంద్ర పిచ్చయ్య. వంగల పద్మావతి శ్రీనివాస్ రెడ్డి. ఓగులూరీ రామాంజి. వేముల పద్మావతి శ్రీనివాసరావు. వైసీపీ యువ నాయకులు బైలడుగు కృష్ణ యాదవ్. దుగ్గినేని వెంకటేష్ బాబు. అనమలమురు సుజాత వెంకటరావు. మోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




