మనస్సున మా రాజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం నూతనంగా మంజూరు అయిన వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం ఎంపీడీఓ కేవై కీర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్ కానుకలను పంపిణీ చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ … గత ప్రభుత్వ హయాంలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్న పెన్షన్ నాడు నవరత్నాల ప్రకటించి పెన్షన్ రెండు వేలు ఇస్తానన్న నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న మాటను నాడు చంద్రబాబు అమలు చేసి కేవలం రెండు నెలల ముందు మాత్రమే పెన్షన్ పెంచారని అన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల వరకు పెంచుకుంటూ పోతున్నారని, నేడు రూ. 2.750 పెన్షన్ ఇవ్వటం ప్రతి ఒక్కిరికి ఆనందదాయకమని అన్నారు. మరో ఏడాదిలో మూడు వేలు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో నాడు రూ.40కోట్లు మాత్రమే అందిస్తున్న పెన్షన్లు నేడు రూ. 1789 కోట్లకు చేరిందని అన్నారు. ప్రతి నివాసంతో చిన్న పిల్లల వద్ద నుండి వృద్ధుల వరకు అన్ని వర్గాల మేలు చేకూరే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. రాబోవు కాలంలో సీఎం వైఎస్ జగన్కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి మరలా -సీఎంకు చేరి మరింత సంక్షేమం పొందాలని కోరారు. నవరత్నాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ సీఎంకు కృతజ్ఞతలు చెప్పాలని కోరారు.ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్లు ముఖ్యమంత్రి పేదల అభ్యున్నతికి చేస్తున్న కృషి, కష్టకాలంలో సైతం ఆదుకున్న తీరును వివరించారు. అనంతరం నూతనంగా మంజూరు అయిన 184 వైఎస్సార్పైన్షన్ కానుకలను అందించారు. అనంతరం ఎమ్మెల్యేను, ఆయన సోదరుడు మద్దిశెట్టి రవీంద్రను వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర, వైఎస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, సర్పంచిలు టి నాగలక్ష్మి, పోశం సుమలత, వలి, మందా శ్యామ్సన్, కోటేశ్వరమ్మ, సుబ్బారావు, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాసరెడ్డి, దర్శి కౌల్సిలర్ వీసీ రెడ్డి, తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఈఓఆర్జీ ప్రసన్నకుమార్, ఎంపీటీసీలు, గ్రామకార్యదర్శులు, సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు.















