రైతులు సమస్యలపై నిర్లక్ష్యం తగదని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ తహసీల్దార్ రామ్మోహన్‌రావును ఆదేశించారు. ఎంపీపీ ఛాంబర్లో బుధవారం పలు శాఖల అధికారులతో స్థానిక సమస్యలపై చర్చించారు. పలువురు రైతులు తమ భూ సమస్యలపై, కొలతలపై ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సర్వేయర్ సక్రమంగా విధులకు రాకపోవటంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటుతో భూముల నష్టపోతున్న రైతులకు ఇచ్చే నష్టపరిహారం పెంపు విషయమై న్యాయం చెయ్యాలని కోరారు. తూర్పు గంగవరంలో ముస్లీం ఈద్గా వద్ద ఉన్న సమస్యలను శాంతి యుతంగా పరిష్కరించిన ఎమ్మెల్యేకు ముస్లీం మైనార్టీ నాయకులు సయ్యద్ లతీఫ్, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.
