ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు ప్రోత్సాహం –
ప్రభుత్వ హాస్టళ్లలో చదువు తున్న విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహించటం ద్వారా పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొ న్నారు. స్థానిక దక్షిణ బైపాస్ లోని జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ప్రభుత్వ సంక్షేమ హాస్ట ళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యా ర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… మొత్తం 119 ప్రభుత్వ హాస్టళ్లలోని 2117 మందికి స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. సాంఘిక సం క్షేమ శాఖలోని 59 వసతి గృహాలకు సంబంధించిన 973 మంది విద్యార్థినీ, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్నారని అన్నారు.
వారిలో 606 మంది తెలుగు మీడియం, 367 మంది ఇంగ్లీషు మీడియం విద్యార్థులున్నారన్నారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలోని 13 వసతి గృహాల్లోని 327 మందికి, 47 బీసీ వసతి గృహాల్లోని 817 మం దికి స్టడీ మెటీరియల్ అందించటం శుభ పరిణామమన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ … పెద్ద విద్యార్థులను ఆదుకోవడం కోసం మొదటి నుండి స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామని అందుకోసం రూ.10,70,523 వెచ్చించటం ద్వారా పేద పిల్లలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలుగు, ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్, స్కేలు, రెండు బాల్పాయింట్ పెన్నులు, రెండు పెన్సిళ్లు, స్కెచ్ పెన్నుల సెట్, జామెంట్రీ బాక్స్లు అందించి పరీక్షలు బాగా రాయాలని చిన్నారులను బాలినేని ఆశీర్వదించారు. కలెక్టర్ ఏఎస్. దినేష్ కుమార్ కూడా పిల్లలకు స్టడీ మెటీరి యల్ అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీప్పీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్. లక్ష్మా నాయక్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం. అంజలాదేవీ, ఎస్టీ సంక్షేమ జిల్లా అధికారి పి.జగన్నాథరావుతో పాటు ఒంగోలు నగర కార్పొరేటర్లు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.