సంక్షేమానికి ఎంత ఖర్చయినా భరిస్తాం – అర్హత ఉంటే చాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటి ముంగిటకే – టీడీపీ వాళ్లు ఎప్పుడైనా ఒక్క ఇంటి పట్టా
అయినా ఇచ్చారా ?
వైఎస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో రీజనల్ కోఆర్డినేటర్ ,ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని

నిరుపేదల బంగారు భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంత ఖర్చయినా భరిస్తుందని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. స్థానిక దక్షిణ బైపాస్ లోని జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఒంగోలు నగర పాలకల సంస్థ ఆధ్వర్యంలో వైఎస్సార్ పెన్షన్ కానుక వారో త్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సద స్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన బాలినేని మాట్లా డుతూ గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా కాకుం డా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి ముంగిటకే వచ్చి చేరుతాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు ఏవీ ఇక్కడ అడ్డంకిగా లేవని గుర్తు చేశారు. వృద్ధులకు పింఛను కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేద న్నారు. ఒక వేళ పింఛను వచ్చినా అవి తీసుకోవటా ని పంచాయతీ కార్యాలయానికో, మున్సిపల్ కార్యాలయానికో, ఎంపీడీఓ కార్యాలయానికో వెళ్లి క్యూల్లో వేచి ఉండాల్సి వచ్చిన రోజులు గురించి గుర్తు చేశారు. 24 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించటానికి పూనుకుంటే అవి ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడన్నారు. జనార్దన్ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడని… ఒక్కరికైనా ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చాడా అని ప్రశ్నించారు. గతంలో తాను ఓం గోలు నగరంలో వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టుకునేందుకు సహకరించానని గుర్తు చేశారు.సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లుగా పింఛన్ల డబ్బులను పెంచుకుంటూ పోతున్నారన్నారు. అందుకే రూ.2500 నుంచి రూ.2750 చేశారన్నారు. పాత పింఛన్లు పెంచటమే కాదు కొత్తగా జిల్లాలో 9656 పింఛన్లు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ దక్కిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ఇంటింటికీ తిరుగుతున్నామని చెప్పారు. వాళ్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నామని, నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వస్తానన్నారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ మాట్లాడుతూ …అర్హత ఉన్న వారికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంపిక చేసి కొత్తగా పింఛన్లు ఇస్తారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతుంటే ప్రతిపక్ష నాయ కులు మాత్రం ఆయనను తీవ్రంగా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేస్తున్న వారిపై నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.కలెక్టర్ ఏఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ. ..జిల్లాలో కొత్తగా కూడా పెన్షన్లు అందించామన్నారు. జిల్లాలో పెన్షన్ పెంపు వల్ల 2,45,165 మంది లబ్ధి. పొందుతున్నారని వివరించారు. జిల్లాలో అన్ని కేటగి రీలు కలిపి 2,86,075 మందికి రూ.79.41 కోట్లు ఈ నెలలో పెన్షన్ల రూపంలో అందిస్తున్నామన్నారు. 2019 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు జిల్లాలో రూ.2.977.5 కోట్లను పెన్షన్ల రూపంలో లబ్దిదారు లకు అందించామన్నారు. జగనన్న హౌసింగ్ (అర్బన్) పథకంలో భాగంగా అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తిస్తున్నామన్నారు. మార్చిలో వీటికి పట్టాల పం పిణీ చేసేలా చర్యలుతీసుకుంటున్నామన్నారు. సదస్సుకు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పింఛనుదా రులకు సీఎం వైఎస్ జగన్ పంపిన సందేశాన్ని చదివి అందరికీ వినిపించారు. ఒంగోలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు నగర కమిషనర్ ఎం. వెంకటేశ్వరరావు ఒంగోలు నగరంలో నూతనంగా మంజూరైన పింఛన్లు, పెరి గిన పింఛన్ల వివరాలను వెల్లడించారు. కార్యక్రమం లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఓం గోలు ఎంపీపీ మల్లిఖార్జున రెడ్డి, కార్పొరేటర్లు అం బట్టి ప్రసాదు, ఈదర సురేష్ బాబు, యనమల నాగ రాజు, గిరిజా శంకర శాండిల్యతో పాటు పలువురు ఒంగోలు నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *