అంధులకు అన్నీ విధాలుగా అండగా ఉంటూ వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. స్పందన భవనంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం లూయీస్ బ్రెయిలీ 214వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వ హించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ తో పాటు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరై లూయీస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… దివ్యాంగుల సమ స్యలు పరిష్కారం చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి పరిష్కారం చేస్తామన్నారు. దివ్యాంగులకు గతంలో ఇచ్చిన ఇళ్ల ప్లాట్లను పునఃపరిశీలించి జగనన్న లే అవుట్ ద్వారా అర్హులందిరికీ పంపిణీ చేస్తా మన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధనల మేరకు ర్యాంక్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగులు వారి ప్రతిభాపాటవాలను ప్రభుత్వ సేవా కార్యక్రమాల్లో వినియో గించాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ.. తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అనంతరం బ్రెయిలీ లిపి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. పలువురు అంధ విద్యార్థులకు లాప్ ట్యాబ్ లు పంపిణీ
చేశారు. అనంతరం చర్చి సెంటర్లోని బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, ప్రజా రవాణా కమి షనర్ కృష్ణవేణి, సాంఘిక సంక్షేమ శాఖ ఏడీ లక్ష్మా నాయక్, డీఆర్డీఏ పీడీ బాబురావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథం, మైనార్జీ సంక్షేమ శాఖ అధికారి ఝాన్సీ ఇతర అధికారులు, అంధ విద్యార్థులు పాల్గొన్నారు.
అంధులకు అండగా ఉంటాం -వారి కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తా – లూయీ బ్రెయిలీ జయంతిలో కలెక్టర్ దినేష్ కుమార్
05
Jan