అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్లు అం దిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక రా బాబు అన్నారు. చీమకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో రూరల్ పరిధిలోని గ్రామాల పింఛన్ల లబ్ధిదారులకు గురువారం వారి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ సీఎం అందిస్తున్న పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లతో వృ ద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వారి కుటుంబాలలో గౌరవం పెరిగిందని బూచేపల్లి వెంకాయమ్మ, సుధాకర్ బాబు అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ మండల మాజీ కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీఈవో వం డర్మ్యాన్, పలు గ్రామాల నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పింఛన్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.


