మహిళా సంక్షేమ అభివృద్ధికి శాఖలు అన్ని సంయుక్తంగా కలసి పనిచేసి కృషి చెయ్యాలని జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల కోఆర్డిటర్ సీహెచ్ కిరణ్ కుమార్ అన్నారు. స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలలో శుక్రవారం ఆరోగ్య, ఆశ, మండల మహిళా సమాఖ్య, అంగన్వాడీ టీచర్లలతో సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల కో ఆర్డిటర్ సీహెచ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ… ఆరోగ్య కార్యకర్తలు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆర్సిహెచ్ నంబర్ గర్భిణులు, బాలింతలు, రెండు సంవత్సరంలోపు పిల్లలకు సంబంధించిన వివరాలను అప్డేట్ చెయ్యాలని కోరారు. రక్త హీనత కలిగిన గర్భవతులు, బాలింతలకు సంబంధించి మంచి ఆహారంపై అవగాహన కల్పించి వారి రక్త హీనతను అధిక మించునట్లు కృషి చెయ్యాలని కోరారు. ఆర్సీ హెచ్ నంబర్లు ఆరోగ్య, అంగన్వాడీలలో సమానంగా ఉండాలని చెప్పారు. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సక్రమంగా అందించాలని కేంద్రాలను ఆహ్లాదకరంగా ఉంచాలని చెప్పారు. గ్రామాలలో బాల్య వివాహాల నిరోధానికి అన్ని శాఖల అధికారులు సక్రమంగా పనిచేయ్యాలని, కౌల్సిలింగ్ లేదా ఎఫ్ఎస్ఐఆర్ లు సైతం నమోదు చేసి ఆపాలని సూచించారు. స్కూల్ బయట పిల్లలు సచివాలయాల వారిగా పర్యవేక్షించాలని కోరారు. రక్తహీనత కలిగిన గర్భణులు, బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి భోజనం చేసే విధంగా పర్యవేక్షించాలని చెప్పారు. బరువులు. ఎత్తులు. ఫ్రీస్కూల్ను సక్రమంగా నడిపించే విధంగా తగిన పరిశీలన చెయ్యాలని కోరారు. ఆయా కార్యక్రమాలలో సీడీపీఓ సీహెచ్ భారతి, మండల వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

