వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడి పోతున్నారని దర్శి నియోజకవర్గ టిడిపి పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి అన్నారు. మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని పెదరావిపాడు ఉమామహేశ్వర పురం గ్రామాలలో శుక్రవారం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షులు శంకరాపురం మాజీ సర్పంచ్ కూరపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సామాన్యుడికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. టిడిపి సభలకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు దళితుల ఓట్లతో గద్దెనెక్కి న ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలను లేకుండా చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు. శంకరాపురం సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి. మాజీ జెడ్పిటిసి లు కొక్కెర నాగరాజు. వరగాని పౌలు. కోడిగమస్తాన్. మాజీ ఎంపిటిసి సుంకర రాఘవరెడ్డి. చాగంటి రాంబాబు. వాకా బ్రహ్మారెడ్డి. తదితరులు పాల్గొన్నారు
