దర్శి కృషి విజ్ఞాన కేంద్రం (కెవికే) ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం అవార్డును స్వంతం చేసుకున్నది. బాపట్లలో గుంటూరు ఆచార్య ఎన్. జి రంగా విశ్వవిద్యాలయంలో
జరిగిన 52వ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశంలో శుక్రవారం ఈ అవార్డును ప్రదానం చేసారు. ఆచార్య ఎన్ జి రంగా విశ్వవిద్యాలయం, గుంటూరు 2021-22 వార్షిక సంవత్సరంలో రైతులకు ఇతర అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తూ అందించిన సేవలను గుర్తిస్తూ వారి ప్రతిభకు ప్రోత్సాహకంగా ఈ అవార్డు దక్కినది. దర్శి కేవికే కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. వి. వి. ఎస్ దుర్గా ప్రసాద్ కు అవార్డును అగ్రూ ఉప కులపతి డాక్టర్ ఎ విష్ణు వర్థన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (మార్కేటింగ్) బత్తుల బ్రహ్మానంద రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు (వ్యవసాయ) ఐ తిరుపాల్ రెడ్డిలు అవార్డును అందించారు. దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది అందించిన సేవలను వక్తలు కొనియాడారు.
ఉత్తమ కెవికే అవార్డు పొందిన దర్శి కృషి విజ్ఞాన కేంద్రం
06
Jan