గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలని తహసీల్దార్ రామ్మోహనరావు కోరారు. నాగంబొట్ల పాలెంలో శనివారం గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటులో భూముల కోల్పోతున్న రైతులకు సర్పంచి చిమటా సుబ్బారావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన మేర నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు. అయితే నష్టపరిహారం మరికొంత పెంచాలని, ఆయా భూములలో ఉద్యాన వన శాఖ పంటలు, ఇతర భూముల వివరాలు పూర్తిగా నమోదు కాలేదని రైతులు తెలిపారు. సభలో ఇన్చార్జి వి. అర్ . ఓ చంద్రశేఖర్ భూముల కోల్పోతున్న రైతుల వివరాలు సభలో చదివి వినిపించారు. గ్రామ కార్యదర్శి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి
07
Jan