మండల కేంద్రమైన ముండ్లమూరులో గల పోలేరమ్మ దేవాలయం నిర్మించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నెలపొంగళ్ళు శనివారం నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పొంగళ్ళు సద్ది పొంగించి నైవేద్యం సమర్పించారు. తెల్లవారుజాము నుండే మహిళలు ఉపవాసాలు ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆలయ పూజారి దుర్భాకుల నగేష్ శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు .


