ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్ఫెఫ్ట్ కార్యక్రమంలో ప్రజలకు చేరువ
చేయటంతో ఉత్తమ ప్రతిభ చాటినందుకు తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి ఉత్తమ అవార్డు పొందారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఆమె ప్రశాంశ పత్రం సోమవారం అందుకున్నారు. మన్నేపల్లి పంచాయితీ పరిధిలో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్యసేవలు చక్కగా నిర్వర్తించినందుకు జిల్లా వైద్యశాఖ గుర్తించి ఈ ఈవార్డుకు ఎంపిక చేసారు. ఉత్తమ అవార్డు పొందిన వైద్యాధికారి భాదర్ మస్తాన్ బి ని తాళ్లూరు మండల వైసిపి ఇన్చార్జ్ మద్దిశెట్టి రవీంద్ర , ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎం.ఎస్పి నాగార్జున రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, మంచాల వెంకటేశ్వర రెడ్డి, వలి, సొసైటీ చైర్మన్ వలాసా రెడ్డి, ఎఎంసీ డైరెక్టర్ రమణా రెడ్డిలు, ఆరోగ్య సిబ్బంది అభినందించారు.
