తాళ్లూరు మండలం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రకృతి వ్యవసాయంతో
పండించిన ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకం మేళాను నిర్వహించనున్నట్లు
వ్యవసాయాధికారి ప్రసాద్ రావు తెలిపారు. ప్రకృతి సాగులో పండించిన రైతులు తమ పంటలను ఈ మేళాలో అమ్ముకోవచ్చని చెప్పారు. వినియోగదారులు
రసాయనిక ఎరువులు, పురుగు మందులు చల్లకుండా పంచిండిన ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ఈ మేళాలో అందుబాటులో ఉంటాయని, కొనుగోలు చేసి ప్రకృతి
వ్యవసాయాన్ని ప్రొత్సహించాలని వ్యవసాయాధికారి కోరారు. స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రజా ప్రతినిథులు, అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకం మేళా
09
Jan