కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేసారు. ముండ్లమూరు మండలంలో ఆయన సోమవారం ఆయన మద్దతుదారులతో కలసి ప్రచారం నిర్వహించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ…….రాష్ట్రంలో రెగ్యులర్ పోస్టులు భర్తీ ఆపివేసి గత పది సంవత్సరాలుగా ఓట్ సోర్సింగ్ ఉద్యోగుల ను నియామకం చేస్తూ శ్రమ దోపిడి కి గురి చేస్తున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో నేడు 60000 కాంట్రాక్ట్ 2.45 లక్షల మంది పార్ట్ టైమ్ ఓట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు ముఖ్యమంత్రి గా తాను అధికారంలోకి వచ్చాక వీరందరినీ రెగ్యులర్ చేస్తానని పాదయాత్ర లో హామీ ఇచ్చారు ప్రస్తుతం ఆ వైపు ఆలోచించుకోవాలి శోచనీయం అన్నారు కొత్త పింఛను పథకం రద్దు చేసి పాత పింఛను పథకం అమలు చేస్తానన్న హామీని మరిచిపోయారు ,కేజీబీవీ ల్లో పనిచేసే వారికి 2016 నుండి పాత జీతాలనే ఇస్తున్నారు, వీరికి మినిమం ట్తెంస్కేల్ వర్తింప చేయాలి,కేజీబీవీ ల్లో పనిచేసే జూనియర్ లెక్చరర్స్ కు నెల కు 12000 జీతం చెల్లిస్తూ రోజు కూలీ కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నారు ఇది శోచనీయం అన్నారు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ నేటికీ లేవు ఉపాధ్యాయ ఉద్యోగులకు 1తేదీ జీతాలు చెల్లించాలని మరిచిపోయారు ఉద్యోగులు ఉపాధ్యాయులు,పెన్సనర్ లు ప్రజల్లో ఒక భాగం అని ప్రభుత్వం గుర్తించాలి శత్రువులు గా చూడండంసరికాదు అన్నారు.రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని ఇస్తే నిరుద్యోగుల , ఉద్యోగుల, ఉపాధ్యాయుల ,పెన్సనర్ లు సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బోడపాటి హనుమంతరావు గారు,యూటిఎఫ్ ముండ్లమూరు మండల అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి గోగుల కోటేశ్వరరావు గారు, జిల్లా కార్యదర్శి ధనిరెడ్ది వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పి క్పష్టారావు,యస్ వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, పాల్గొన్నారు.