మా భూమిని మాకే ఇవ్వాలని గంగన పాలెం గ్రామానికి చెందిన భూమిలేని నిరుపేదలైన ఎస్సీలు స్థానిక తాసిల్దార్ కార్యాలయం సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వే ల్లంపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ2018 నుండి గంగన పాలెం పేదలకు పెత్తందారులకు మధ్య భూ సమస్య ఉందని నేటికీ ఆ సమస్య తేల్చలేదని గంగన్న పాలెం పేదల వాపోయారు. ఈ భూములు మాకు ఇవ్వాలని మారెళ్ళ గ్రామం వారికి ఎలా ఇస్తారని అన్నారు. మాకు భూమి లేదని నిరుపేదలమని ఆ భూమిని మాకు ఇవ్వాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రం తహసిల్దార్ ఎస్ ఉషారాణికి ఇవ్వడం జరిగింది తహసిల్దార్ మాట్లాడుతూ ఆ భూములను పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పా రన్నారు. ఈ కార్యక్రమంలో ఇర్మియా. రామస్వామి .యాకోబు. హిమలయ్య. సింగయ్య. తదితరులు ఉన్నారు.
మా భూమిని మాకె ఇవ్వాలి
09
Jan