ఇబ్బంది పడుతున్న గర్భవతులను గుర్తించి కాన్పులు ఇబ్బంది కరంగా ఉన్న గర్భవతులను గుర్తించి అద్దంకి హాస్పటల్లో ఆపరేషన్ చేసేందుకు రిఫర్ చేయాలని వైద్యాధికారిని వి జ్యోతి అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం పై గర్భవతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జ్యోతి మాట్లాడుతూ గర్భవతులు అనేక రకాల పరీక్షలు చేయించుకొని వైద్యాధికారుల సలహాలు సూచనల మేరకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. వైద్యాధికారిణి ఎం జాస్మిన్ మాట్లాడుతూ గర్భవతులు బలవర్ధకమైన ఆహారం తీసుకొని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకొని పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుదాసు. స్టాఫ్ నర్స్ కన్యాకుమారి. రత్నకుమారి. హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్. యుగంధర్. నాగార్జున. సిహెచ్ దిలీప్. ప్రభావతి. తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బంది పడుతున్న గర్భవతులను గుర్తించాలి – వైద్యాధికారిని వి జ్యోతి
09
Jan