ముండ్లమూరు మండలం లో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఏడు అర్జీలు వచ్చాయని తహసిల్దార్ ఎస్ ఉషారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని గ్రామాల ప్రజలు రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ముండ్లమూరు తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. అందులో ఏడు మంది పేదలు అసైన్మెంట్ భూములు మంజూరు చేయాలని అర్జీలు అందినట్లు ఆమె తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి పి ఓబులేసు. డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి. రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవికాంత్. సీనియర్ అసిస్టెంట్ శేషగిరిరావు. అంగన్వాడి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
ముండ్లమూరు మండలం లో స్పందన కు ఏడు అర్జీలు – తహసిల్దార్ ఎస్ ఉషారాణి
09
Jan