గ్రామీణ ప్రాంతాల్లోని పేద నిరుపేదల ప్రజల కోసం ప్రభుత్వం సొంత గ్రామాల్లోనే డాక్టర్ వైఎస్ఆర్ క్లినిక్ ల వద్ద104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల పోలవరం గ్రామంలో సోమవారం వైద్య సేవ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పట్టణాల లోని హాస్పిటల్స్ కు వెళ్లలేని స్థితిలో ఉన్న వారి కోసం ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా వైద్య సేవ లు అందిస్తున్నారు. ప్రభుత్వం 104 వాహనాల ద్వారా 67 రకాల మందులు 12 రకాల రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారన్నారు. ఇలాంటి శిబిరాలకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ శిబిరంలో 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో బాలింతలు2 గర్భవతులు7 షుగర్30 బిపి25 జలుబు దగ్గు జ్వరం11 మందికి గుర్తించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని.104 డీఈవో వెంకట ప్రసాద్. సిహెచ్ఓ కే శరణ్య. ఏఎన్ఎం సుమతి. ఆశాలు తదితరులు పాల్గొన్నారు
సొంత గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలు
09
Jan