రాష్ట్ర ప్రభుత్వం రోడ్డులపై ర్యాలీ , సభలను నిషేధిస్తూ తెచ్చిన నిరంకుశ జీ.వో నంబరు 1 ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు సిపియం ఆధ్వర్యంలో దరిశి బస్టాండు సెంటర్ లో నిరసన తెలిపి జి.వో 1 కాపీలను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపియం దరిశి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ ….. 1861 లో స్వాతంత్ర్య పోరాటాన్ని అణచడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1861 లో ఈ చట్టం తెచ్చిందని ఇప్పుడు ఆ చట్టం వైసిపి ప్రభుత్వం తేవడం ఆంద్ర ప్రజల ఆత్మగౌరవానికే మచ్చగా ఉందని.. ఈ చట్టం తో రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులనే కాలరాస్తుందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను , ప్రజా సంఘాలను , ప్రజా ఉధ్యమాలను అణచడానికే ఈ చట్టాన్ని తెచ్చిందని రద్దు చేసే వరకు సిపియం పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు… ఈ నిరసన లో సిపియం నాయకులు ఉప్పు నారాయణ , ఈమని నాగేశ్వరరావు , పోట్లూరి పుల్లయ్య , గర్నిపూడి జాన్ , అంజిబాబు , ఆదినారాయణ , మోహనరావు ,శ్రీను , సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
నిరంకుశమైన జి.వో 1 రద్దు చేయాలి. సిపియం
09
Jan