రైతులకు వట్టిన మన పరీక్షలు అవగాహన పెంపొందించాలని శాస్త్రవేత్త డాక్టర్ సుధానంద సూచించారు. విజయవాడ నందు పిపిఎల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం నందు సోమవారం జై కేస్ మరియూ డి బి టి ఎస్ లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి లోని అగ్రికల్చర్ లేబరేటరీ శాస్త్రవేత్త డాక్టర్ సుధానందా విచ్చేశారు . ఈ సందర్భంగా ఆయన మట్టి నమూనా పరీక్షను ఎలా చేయాలి దానికి సంబంధించిన విధి విధానాలను, పి పీఎల్ కంపెనీ లో లభ్యమగు ఉత్పత్తుల్లో పంటలకు ఉపయోగపడే న్యూట్రియన్స్ , సూక్ష్మ పోషకాలు గురించి వివరించారు. ఏ ఎరువులు ఎంత మోతాదులో ఎప్పుడు వాడాలో ఆయన తెలిపారు. రైతులకు సంబంధించి కంపెనీ అందిస్తున్న సేవలను, సలహాలు మరియు సూచనలు మీద జే కేఎస్ మరియు డి బి టి ఎస్ లకు సంపూర్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కృష్ణమూర్త, ఎండిఓ ఎస్ఎండి రఫీ, మార్కెటింగ్ ఆఫీసర్ సుభాష్, జెకెఎస్ లు , డి బి టి ఎస్ లు పాల్గొన్నారు.

