మ్మెల్సీ ఇంతటి అభివృద్ధి చేయగలడు అని చేసి చూపుతా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు . ప్రకాశం జిల్లా, దర్శి కేంద్రంలో దర్శి నియోజకవర్గానికి సంబంధించి స్కూల్ కరస్పాండెంట్స్, పట్టభద్రులు, ఉపాధ్యాయులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అవగాహన సదస్సులో నిర్వహించారు . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ .. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నాకు, నా మీద నమ్మకంతో తూర్పు రాయలసీమ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయం గురించి గంటసేపు అనర్గళంగా మాట్లాడగలనని, పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దీని గురించి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం జూలై నుంచి నా దృష్టికి వచ్చిన ఉపాధ్యాయుల, ప్రవేట్ స్కూల్ యజమానుల, జూనియర్ లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, త్వరలో కొన్ని సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు. మీరందరూ ఒక్క అవకాశం కల్పిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇంత అభివృద్ధి చేయగలడా అని అనుకునే విధంగా చేసి చూపిస్తానని తెలిపారు. మీరందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. మండల పార్టీ
అధ్యక్షుడు, మాజీ ఎఎంసీ చైర్మన్ వెన్నపూస వెంకట రెడ్డి (మహేష్), రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిషియన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, కౌల్సిలర్ మేడం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


