ముండ్లమూరు మండలంలోని మారళ్ళ గ్రామంలో డెంగ్యూ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో మంగళవారం ఇంటింటికి తిరిగి ఆరోగ్య సిబ్బంది లారా సర్వే నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలను అప్రమత్తం చేసి నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఇంటి ఆవరణలో తాగి పడవ వేసిన కొబ్బరి బోండాలు తాగి పడవేసిన డిస్పోజబుల్ గ్లాసులు లేకుండా చేసుకోవాలన్నారు. పాత టైర్లు ఉన్నట్లయితే వాటి నీ తీసివేయాలన్నారు. నీటి తొట్లలో లార్వా ఉన్నట్లయితే గుర్తించి ఆ నీటిని పారబోయాలన్నారు. ఎస్సీ కాలనీలో గ్రామ సర్పంచి గోపన బోయిన వెంకటేశ్వర్లు పారిశుద్ధ్య సిబ్బందిచే బజార్ల వెంట ది బ్బల వద్ద ఇంటి చుట్టుపక్కల బ్లీచింగ్ పిచికారి చేయిస్తున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి పరిసరాలను పరిశీలిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ వెంకటరావు. హెచ్ వి ఎస్కే హుస్సేన్ బి. హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు. హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని. గోపనబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
