కురిచేడు మండలంలోని పొట్లపాడు గ్రామంలో గుత్తికొండ రామయోగి తాత ఆరాధన ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీ లను దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ మంగళవారం ప్రారంభిం చారు. ఆరు పళ్ల విభాగంలో 12 జతల ఎడ్లు పోటీపడుతున్నాయి. బుధవారం న్యూ కేటగిరీలో పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బహుమతులు దాతల సహకారంతో అందజేస్తున్నట్లు
పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ నుసుం గోవిందరెడ్డి, ఫిషరీస్ సంస్థ స్టేట్ అడ్వయిజర్ షేక్ సైదా, ఏఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, వైస్ చైర్మన్ కేసనపల్లి నాగేశ్వరరావు, ఎంపీటీసీ బుల్లం వెంకటనర్సయ్య, బీసీ కార్పొ రేషన్ డైరెక్టర్ నిమ్మకాయల రాజయ్య, కురిచేడు సొసైటీ ప్రెసిడెం ట్ మర్రి సుబ్రహ్మణ్యం, కల్లూరు సర్పంచ్ నక్కా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

