ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యమం త్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంలో భాగంగా ఆవులమంద ఎస్సీ కాలనీలో ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయి, సమస్యలేమన్నా ఉన్నాయా అం టూ ఆరా తీశారు. ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పింఛన్లు కొందరికి రాలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. వాటిపై అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదు రైనా వెనకడుగు వేయకుండా ప్రతి అభివృద్ధి, సం క్షేమ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. ప్రతి ఇం టికీ లబ్ధి చేకూరుతుందని, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహనరెడ్డిదే నన్నారు. రాజకీ యంగా కూడా హహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పదవులు ఇచ్చి రాజకీయ చరిత్రలో సామాజిక న్యాయం పాటించిన నాయకుడుగా ప్రశంసలు పొందారన్నారు. రాజకీయ ఎదుగుదల చూడలేని ప్రతిపక్షాలు ఏదోరకంగా గందరగోళం సృష్టించాలని చూస్తున్నాయని, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించటమే లక్ష్యంగా జీవో తెచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడు తున్న పల్లె సుందరయ్యకు ఆర్థిక సహాయం అందజే శారు. ఎంపీడీఓ వి. భవ్య, తహసీల్దార్ షేక్. నాగూ ల్మీరా, ఎంఈఓ ఆర్. వస్త్రాం నాయక్, ఏఓ ప్రకాష్ రావు, ఏఈలు ఆదిరెడ్డి, థావూనాయక్, వైసిపి నాయకులు షేక్. సైదా, సుబ్బయ్య, కేసనపల్లి నాగేశ్వరరావు, సర్పంచ్ నక్కా రామకృష్ణ, మర్రి సుబ్రహ్మణ్యం, గొట్టిపాటి బాలకోటయ్య, గొట్టిపాటి బొల్లికొం డయ్య, చిన్నపెద్దయ్య, బెల్లం చంద్రశేఖర్, వెంకటే రత్నం, నిమ్మకాలయ రాజయ్య, లక్ష్మయ్య, వైవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

