రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తెలుసుకుని వారు అడగకుండా అవసరాలను సమ కూర్చే జన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని పొట్లపాడు గ్రామంలో శ్రీ గుత్తికొండ రామయోగీతాత ఆరాధన ఉత్సవాల్లో కొండా కోటిరెడ్డి, గ్రామస్తులు నిర్మించిన విద్యుత్ ప్రభను సందర్శిం చి ఆమె మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నూరుశాతం నెరవేర్చిన దమ్మున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారని ఆమె తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను సైతం మైమరపించేలా పరిపాలన దక్షత కలిగిన నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరే అని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. అవకాశం కోసం నాయకులు వస్తుంటారు, పోతుంటారని, పార్టీకి కార్యకర్తలే శాశ్వతమని అన్నారు. బాబుకి ప్రజల ప్రాణం కన్నా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, కురి చేడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గోగులముడి లింగారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్వీ నాగి రెడ్డి, నుసుం ప్రతాపరెడ్డి, నుసుం రమణారెడ్డి, నుసుం భాస్కరరెడ్డి, నుసుం రామకోటిరెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, పాతకోట వెంకటరెడ్డి, నాగయ్య, చిరంజీవి, కార్యకర్తలు పాల్గొన్నారు.

