జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశాలు ఉత్సాహంగా సాగాయి. ఆయా స్థాయి సంఘాలలోని సభ్యులు అర్థవంతమైన చర్చను లేవనెత్తారు. తొలుత ఇటీవల మర ణించిన పర్చూరు జడ్పీటిసి సభ్యురాలు కొల్లా గంగాభవానీ ఆత్మకు శాంతి కలగాలని 2 నిమి షాలు మౌనం పాటించారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ 2వ కమిటీ గ్రామీణాభివృద్ధి, 3వ కమిటీ వ్యవసాయ సంబంధిత, 4వ కమి టీ విద్య, వైద్య, 5వ కమిటీ మహిళా, శిశు
సంక్షేమం, 6వ కమిటీ శిశు సంక్షేమము, 1 మరియు 7 స్థాయీ సంఘాల సభ్యులు సం బంధిత శాఖాధికారులతో అజెండా అంశాలపై సమీక్షలు నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు. 3వ కమిటీ వ్యవసాయ సంబంధిత వ్యవహారాలపై వైస్ చైర్మన్ యన్నాబత్తిన అరుణ, 5వ కమిటీ మహిళా, శిశు సంక్షేమానికి కొండపి జడ్పీటిసి సభ్యురాలు మారెడ్డి అరుణ అధ్యక్షత వహిం చారు. జిల్లా ప్రజా పరిషత్ సాధారణ నిధుల
నుండి ప్రకాశం జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గహాలలో చదువుతున్న 10 తరగతి విద్యార్థినీ విద్యార్థులకు స్టడీమెటీరియల్, జామెంట్రీ బాక్స్‌లు ఏర్పాటు చేయటానికి 10 లక్షలు మంజూరు చేసిన వివిధ సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మని ఘనంగా సన్మానించారు. సమావేశంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.


