రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు ప్రదర్శ నలో మండలంలోని కాటంవారిపల్లెకు చెందిన కాటం పెద్దిరెడ్డి, కురిచేడు మాజీ సర్పంచ్ పోతిరెడ్డి నాగిరెడ్డి లకు చెందిన ఎద్దులు విజేతగా నిలిచాయి. మండలంలోని పొట్లపాడు గ్రామంలో శ్రీ గుత్తికొండ రామయోగితాత ఆరాధనా ఉత్సవాల సందర్భం గా ఆలయ ధర్మకర్త నుసుం గోవిందరెడ్డి బండలా గుడు పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో 6 పళ్ల సైజులో 12 జతలు పోటీపడగా పీఎస్ఆర్ఆర్ ఎడ్లజత 5100 అడుగులు లాగి ప్రథమ బహుమతి రూ.40 వేలు కైవసం చేసుకుంది. ద్వితీయ బహుమతి పుచ్చకాయల శివపార్వతి ఎడ్లజత 5075.7 అడుగులు లాగి రూ.30 వేలు, తృతీయ బహుమతి సంతమాగులూరుకు చెందిన వజ్రాల తేజశ్రీరెడ్డి ఎడ్లజత 4525.8 అడుగులు లాగి రూ.25 వేలను కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతిని తక్కెళ్లపాడుకు చెందిన మోపర్తి నవీన్ కుమార్ చౌదరి ఎడ్లజత 4500 అడుగులు లాగి రూ.20 వేలు, ఐదో బహుమతిని శావల్యాపురానికి చెందిన ముండ్రు మల్లయ్య బ్రదర్స్ ఎడ్ల జత 4490 అడుగులు లాగి రూ.15 వేలు, ఆరో బహుమతినిబత్తుల చిన్నబ్బాయి ఎడ్లజత 4294 అడుగులు లాగి రూ.12 వేలు, 7వ బహుమతిని ఎర్రబాలెంకు చెం దిన హేమంతనాయుడు ఎడ్లజత 1093.10 అడు గులు లాగి రూ.10 వేలు గెలుపొందాయి. 8వ బహుమతిని రెంటచింతల కు చెందిన నెల్లూరి అన్వి కాచౌదరి ఎడ్లజత 4032.4 అడుగులు లాగి రూ.7116, 9వ బహుమతిని నరసరావుపేట ఇస్స ప్పాలేనికి చెందిన ఇట్టే దుర్గారావు ఎడ్లజత 3900 అడుగులు లాగి రూ.5 వేలు సాధించాయి. అలాగే న్యూ కేటగిరీ విభాగంలో ప్రథమ విజేత గా మండ లంలోని కాటంవారిపల్లెకు చెందిన కాటం పెద్ది, పోతిరెడ్డి నాగిరెడ్డిల ఎడ్లజత 4226.2 అడుగులు లాగి ప్రథమ బహుమతి రూ.50 వేలు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేతుల మీదుగా అందుకున్నారు. ద్వితీయ బహుమతిని ఖాజీపురా నికి చెందిన వేగినాటి ఓసూరా రెడ్డి ఎడ్ల జత 4204.6 అడుగులు లాగి రూ.40 వేలు కైవసం చేసుకున్నారు. మూడో బహుమతిని చీమకుర్తికి చెం దిన జంగా విజయభాస్కరరెడ్డి ఎడ్లజత 4200 అడు గులు లాగి రూ.30 వేలు, 4వ బహుమతిని దర్శి కి చెందిన గానుగపెంట రాజశేఖరరెడ్డి ఎడ్లజత 10.11 అడుగులు లాగి రూ.25 వేలు, 5వ బహు మతిని ప్రొద్దుటూరుకు చెందిన ద్వార్యాల గురివి రెడ్డి ఎడ్లజత 3364.4 అడుగులు లాగి రూ.20 వేలు, 6వ బహుమతిని వైఎస్సార్ కడపకు చెందిన ఎడ్లజత 3300 అడుగులు లాగి రూ.15 వేలు, 7వ బహుమతిని యర్రగొండపాలేనికి చెందిన నజీరా బా షా, సుభానీల ఎడ్లజత 3223.7 అడుగులు లాగి రూ.12 వేలు గెలుపొందాయి. 8వ బహుమతిని బేస్తవారిపేటకు చెందిన గంగూలీ బ్రదర్స్ ఎడ్లజత 2951.6 అడుగులు లాగి రూ.10 వేలు, 9వ బహు మతిని సుంకేసులకు చెందిన మువ్వపాటి శ్రీనివా సులు ఎడ్ల జత 2941.3 అడుగుల లాగి రూ.5 వేలు సాధించాయి. విజేతలకు బహుమతులను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు నుసుం గోవింద. రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ అడ్వ యిజర్ షేక్.సైదా, ఏఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య. వైస్ చైర్మన్ కేసనపల్లి నాగేశ్వరరావు, కురిచేడు సొసైటీ ప్రెసిడెంటు మర్రి సుబ్రహ్మణ్యం, ఆవుల వెంకటరెడ్డి, జ్యోతి అంకారావు, పోతిరెడ్డి వెంకటరా మిరెడ్డి, మారం వెంకట సుబ్బారెడ్డి, ముశికర యోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
