రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరిం చాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాల యంలో ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ… భూ సర్వేలు ఎంతవరకు పూర్తయ్యాయి? పూర్తి స్థాయి సర్వే ఎన్ని రోజులు పడుతుందనే అంశాలపై చర్చించారు. అందుకు సంబంధించిన సమస్యలు అధిగమించేందుకు అన్నీ విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. అసైన్మెంట్ కమిటీలు ఇచ్చే ఫిర్యాదులు తప్పని సరిగా స్వీకరించాలన్నారు. అర్జీదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు పరి ష్కరించాలని సూచించారు. భూ సమస్యల్లో
ఇబ్బందులు ఉంటే అసైన్మెంట్ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి కలిసి కట్టుగా వాటిని అధిగమించేందుకు కృషి చేద్దామని చెప్పారు. తహసీల్దార్ శ్రావణ్ కుమార్, నియోజకవర్గంలోని అన్ని మండలాల తాసిల్దారులు , రెవెన్యూ అధికా రులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి – ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ – రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహణ
11
Jan