గ్రామ పంచాయతీలలో గ్రీన్ అంబాసిడర్ లు సేకరిస్తున్న తడి పొడి చెత్తను చెత్త సంపద కేంద్రాల్లో వేసి చెత్త సంపద తయారు కేంద్రాలుగా వినియోగంలో తీసుకురావాలని ఈవో పి ఆర్డి పి ఓబులేసు అన్నారు స్థానిక మండల పరిషత్ సమావేశపు హాలులో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ కార్మికుల సేకరిస్తున్న తడి పొడి చెత్తను వేరువేరుగా వేసి ఎండబెట్టి ఎరువులుగా తయారుచేసి ఎరువులను విక్రయించిన ద్వారా వచ్చిన నగదును గ్రామ అభివృద్ధికి వినిగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయాలన్నారు. ఇంటి పన్నులపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించి వాటి వసూళ్లకు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలి
11
Jan