ముండ్లమూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో మరియు వేద ఫార్మసీ కళాశాలలో, పెద ఉల్లగల్లు లలో బుధవారం ముందుస్తూ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ముగ్గులు వేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. హరిదాసు వేషా ధరణలో విద్యార్థులు ఆలరించారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కే పూర్ణచంద్రరావు. వేద ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఏ ఎం ఎం ఎస్ సుధాకర బాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన వారసత్వ సంపద అని అన్నారు. కొత్త కొత్త అల్లుళ్లతో కొత్త పంటలతో సంక్రాంతి పండుగను ఆనందోత్సాల మధ్య జరుపుకునే వారన్నారు. సాంప్రదాయ విధానాలు కుటుంబ బంధాలను పెంపొందించే సంక్రాంతి పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

