గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల సమస్యకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పరిష్కారం చూపారు. హైవే ఏర్పాటులో పొలాలు కోల్పోతున్న రైతులకు రూ. 7.8 లక్షల నష్టపరిహారం వస్తాయని తెలపటంతో ఆందోళన చెందిన రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ స్వయంగా పరిశీలించి నష్టపరిహారం రూ. 12 లక్షలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో రైతులు హేవే ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యే రైతులను కోరారు. ఆయన వెంట ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచి వలి తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల సమస్యలకు ఎమ్మెల్యే పరిష్కారం – నష్టపరిహారం రూ. 7.8 లక్షల నుండి రూ. 12లక్షలు పెంపు
11
Jan