తురకపాలెం మైనర్ ఇరిగేషన్ చెరువులో చేపలు వేసి పెంచుకొనుటలకు బుధవారం గ్రామ పంచాయితీ వద్ద బహిరంగ వేలం నిర్వహించారు. అద్దంకి మండలం గుర్రవారి పాలెం గ్రామానికి చెందిన ఉయ్యాల ఏడుకొండలుమూడేళ్లకాలానికి రూ. 14లక్షలకు అధికంగా పాట పాడి దక్కించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచి గురువా రెడ్డి, ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు వజ్జా శ్రీనివాసరావు, ఈఓఆర్డీ, ఇన్చార్జి గ్రామకార్యదర్శి ప్రసన్నకుమార్, సొసైటీ మాజీ అధ్యక్షుడు ఓబులురెడ్డి పాల్గొన్నారు.
