ముండ్లమూరు మండలంలోని వేముల గ్రామంలో ఈనెల 13 నుండి ప్రకాశం గుంటూరు ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల వైసిపి యువ నాయకు డు బైల డుగు కృష్ణ యాదవ్ బుధవారం తెలిపారు అందుకుగాను ప్రకాశం గుంటూరు ఉమ్మడి జిల్లాలో పరిధిలో గల కబడ్డీ పై ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ జట్లు వివరాలను ఎంట్రీ ఫీజు 600 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వేములలో నూతన సచివాలయం ప్రాంగణంలో ఈనెల 13 నుండి 16 వరకు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. మొదటి బహుమతి35116 కాసుల వీరబ్రహ్మం. రెండవ బహుమతి20116 గజ్జల రామ ముసలా రెడ్డి. మూడో బహుమతి10116 అన్నపురెడ్డి రమణారెడ్డి. నాలుగవ బహుమతి5116 కుమ్మిత శ్రీనివాస్ రెడ్డిలు ప్రకటించారు. బెస్ట్ రైడర్ కు ప్రత్యేక బహుమతి అందజేయడం జరుగుతుందని అన్నారు.
13 నుండి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల లో కబడ్డీ పోటీలు
12
Jan