మహిళా రైతు సంఘాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరులో రైతు భరోసా కేంద్రంలో గురువారం మహిళా రైతు సంఘాలతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయాధికారి మాట్లాడుతూ … మహిళా పొదుపు సంఘాలు విజయం సాధించిన విధంగానే మహిళా రైతు సంఘాలు కూడ విజయ బాటలో నడిపించే విధంగా విఏఏలు కృషి చెయ్యాలని కోరారు. మండలంలో 107 మహిళా రైతు సంఘాలు ఏర్పాటు చేసామని, ఒక్కోక్క సంఘంలో 15 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. ఆరు నెలల పొదుపు అనంతరం ఒక్కక్క సంఘానికి బ్యాంకు నుండి రుణం, ప్రభుత్వం నుండి క్యాపిటల్ ఫండ్ అందుతుందని చెప్పారు. ఎఫ్. పి. ఓ ఏర్పాటు అయి బోర్డు ఆఫ్ డైరెక్టర్ ఏర్పడినట్లయితే వైఎస్సార్ క్రాంతి పథం, వ్యవసాయశాఖ సమన్వయంగా పనిచేసి మంచి స్టాల్స్ను సైతం ఏర్పాటు చేయ్యవచ్చని తెలిపారు.
