నాణ్యమైన విద్యుత్‌ను అందించటమే లక్ష్యంగా విద్యుత్ సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని విద్యుత్ ఈఈ ఎస్. ఎ. అబ్దుల్ కరీం అన్నారు. తాళ్లూరు విద్యుత్ సబ్ స్టేషన్లో గురువారం విద్యుత్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ అబ్దుల్ కరీం మాట్లాడుతూ…. విద్యుత్ సిబ్బంది ఉదయం 8గంటల సమయానికి ఆపరేషన్ కార్యాలయంలో హాజరు అయి ఆరోజు చెయ్యవలసిన పని విధానంపై చర్చించి విధులలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. అత్యవసర పరిస్థితులలో చేపట్టాల్సిన పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి డ్యామెజి పోల్స్. లైన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్డీఎస్ స్కీములో 30 ఏళ్ల నుండి 25 ఏళ్లకు పైబడి ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లలో ప్రత్యేక మరమ్మత్తులు చేపట్టనున్నట్లు చెప్పారు. అందులో దొనకొండ, ముండ్లమూరు, పొదిలి, చీమకుర్తి, కొనకల మిట్ల, తాళ్లూరు సబ్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల వసూలు నూరు శాతం లక్ష్యంగా పెట్టుకుని ఎప్పటికప్పుడు సిబ్బంది అప్రమత్తమై వసూలు చెయ్యాలని కోరారు. మీటర్ సీలింగ్‌లు త్వరలో పూర్తి చేసి పూర్తి స్థాయిలో విద్యుత్ చోరిని అరికట్టనున్నట్లు తెలిపారు.
విద్యుత్ బిల్లులకు అధార్ తప్పుగా నమోదు అయి వైఎస్సార్ ఫించన్ కానుక నిలచి పోయి వారి విషయంలో ఎవైనా తప్పులు దొర్లినట్టయితే సహకరించి వారికి సిబ్బంది సహకరిస్తున్నట్లు చెప్పారు. ఆధార్ అనుసంధానంలో సిబ్బంది చేరిన తప్పులు, సాధికార సర్వేలో జరిగిన లోపాలతో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు చెప్పారు. డైరెక్ట్ బెఫిఫియర్ ప్రొగ్రాం (డిబీఎస్) నూరు శాతం పూర్తి అయినట్లు తెలిపారు. సిబ్బంది ఎక్కడైనా సక్రమంగా పనిచేయక పోయినా తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా లోపాలు ఉంటే తగిన పరిశీలన చెయ్యాలని ఎఈని ఆదేశించారు. విద్యుత్ బిల్లులు ప్రజలు సకాలంలో చెల్లించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సహకరించాలని కోరారు. ఎడీఈ పిచ్చయ్య, ఎఈ వీర బ్రహ్మం తదితరులు
పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ అందించటమే లక్ష్యంగా పనిచెయ్యాలి – విద్యుత్ బిల్లులను సకాలంలో వసూలు చెయ్యాలి – ప్రతి మీటర్‌కి సీల్ తప్పనిసరిగా వేసి విద్యుత్ చోరికి ఆరికట్టాలి – విద్యుత్ ఈఈ ఎస్. ఎ. అబ్దుల్ కరీం
12
Jan