గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగితేనే హైవే ఏర్పాటుకు సహకరిస్తామని రెవిన్యూ అధికారులకు రైతులు తెలిపారు. తాళ్లూరు రైతు భరోసా కేంద్రంలో గురువారం హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు గ్రామ సభ నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డిలు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం విషయమై ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ జిల్లా కలెక్టర్తో చర్చించి రూ. 12 లక్షల వరకు పెంచినట్లు రైతులకు తెలిపారు. అయితే మరో 11శాతం వరకు కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చన్న విషయాన్ని రైతులు సభ దృష్టికి తెచ్చారు. దీంతో పాటు బోర్లకు, పైప్ లైన్స్, ఉద్యాన వన పంటలు కోల్పోతున్న పలువురు పేర్లు జాబితాలో లేవని వాటిని కూడ సవరించి పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యాలని కోరారు. రైతులు ఒప్పుకున్న ప్రకారం వారి ఆధార్, పాస్ పుస్తకం, పాన్, బ్యాంకు అకౌంట్ వివరాలను అందజేయ్యాలని డిప్యూటీ తహసీల్దార్/ ఇస్మానియేల్ రాజు కోరారు. అయితే తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు సహకరించమని రైతులు సభను నుండి వెళ్లి పోయారు. విఆర్ చంద్ర, ఎస్ మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగితేనే హైవే ఏర్పాటుకు సహకరిస్తాం- గ్రామ సభలో రెవిన్యూ అధికారులకు తెలిపిన రైతులు
12
Jan