సంఘాల్లోని మహిళలు జీవనోపాదుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవాలని వైకెపి ఎపిఎం టి హనుమంతరావు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ క్రాంతి పథకం కార్యాలయంలో గురువారం సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత ద్వారా18750 రూపాయలు ఇప్పటివరకు మూడు విడతలుగా ఇవ్వడం జరిగిందన్నారు. చేయూత ద్వారా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలతో అభివృద్ధి చెందాలన్నారు. సమస్తా గత నిర్మాణం ద్వారా ప్రతి గ్రూపు సక్రమ మైనపద్ధతిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని పొదుపులో అప్పులు చెల్లించాలన్నారు. స్త్రీ నిధిద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలన్నారు. స్త్రీ నిధి రికవరీలో ముండ్లమూరు మండలం వెనుకబడి ఉన్నందున మిగిలిన లబ్ధిదారులకు లోన్లు ఇవ్వడంలో అధికారులు ముందుకు రావడం లేదని అన్నారు. లోన్లు తీసుకున్న లబ్ధిదారులు తిరిగి చెల్లించి మిగిలిన వారికి కూడా ఇబ్బందులు లేకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిసి మోహనరావు. గురవయ్య. అకౌంటెంట్ మార్తమ్మ. మహిళలు పాల్గొన్నారు.
